విశాఖ నగర పరిధిలో గోపాలపట్నానికి చెందిన మొయ్య నారాయణరావు అనే హోంగార్డు చింతపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. హోంగార్డు సీలేరులో ఏపీ జెన్‌కోలో డిప్యుటేషన్‌పై ఏడాది పాటు పనిచేసిన అనంతరం అనకాపల్లి ఆర్‌టీఏ కార్యాలయానికి బదిలీపై వెళ్లాడు. తాజాగా మరలా సీలేరు ఏపీ జెన్‌కోకు వెళ్లమని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆదేశాలు రావడంతో శనివారం విధుల్లో చేరడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. చింతపల్లి వద్దకు వచ్చేసరికి పాదాచారులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న 108 వాహనంను ఢీకొని కింద పడిపోయాడు. నారాయణరావు మీద నుంచి వాహనం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహానికి పంచనామా చేసి స్వగ్రామానికి తరలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి - agency
విశాఖ జిల్లా చింతపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డుప్రమాదం