విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి భక్తులకు అనుమతినిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే శుభకార్యాల సమయంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో త్రినాథరావు వివరించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి 23 నుంచి సింహగిరిపై శుభకార్యాలు, వసతికి అనుమతి ఇవ్వలేదు. లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో తాజాగా ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. దీనివల్ల అప్పన్న ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.