విశాఖపట్నం జిల్లా కిర్లంపూడి లేఅవుట్లో నివాసముంటున్న అక్కిశెట్టి శంకర్‌నారాయణ్ అనే వ్యాపారి గతేడాది హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్లో దిగాడు. తాను నగరానికి వచ్చినప్పుడల్లా హోటల్ గది సిద్ధంగా ఉంచాలని చెప్పడం... తరచుగా వస్తారని ధర తగ్గించి మరీ రూమ్ ఇచ్చారు హోటల్ సిబ్బంది.
ఫైవ్ స్టార్ హోటల్లో బసచేశాడు... 13 లక్షల బిల్లు ఎగ్గొట్టాడు... - తాజ్ బంజారా
హోటల్లో ఒకపూట భోజనం చేసి బిల్లు చెల్లించకుండా వెళ్తే... నానా హంగామా సృష్టించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 102 రోజులు స్టార్ హోటల్లో బస చేసి దాదాపు 13 లక్షల రూపాయల బిల్ ఎగ్గొట్టి చాకచక్యంగా అక్కణ్నుంచి మాయమయ్యాడు.
102 రోజులు... రూ.25 లక్షలు
సుమారు 102 రోజులు బస చేసినందుకు అయిన రూ.25.96 లక్షల బిల్లులో 13.62 లక్షలు చెల్లించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న బిల్లు చెల్లించకుండా గదిలోంచి మాయమయ్యాడు. అప్పటి నుంచి బకాయిలు చెల్లించాలని పలుమార్లు హోటల్ యాజమాన్యం శంకర్నారాయణ్కు ఫోను చేసినా స్పందించలేదు. తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం వల్ల తాజ్ బంజారా జనరల్ మేనేజర్ హితేంద్రశర్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పుడు శంకర్ నారాయణ కోసం వెతుకుతున్నారు.
- ఇదీ చూడండి : థర్మకోల్ పడవల్లో ప్రమాదకర ప్రయాణం