సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని విశాఖ డీసీపీ సురేష్ బాబు ప్రజలకు సూచించారు. పేటీఎం కేవైసీ పేరిట కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పేటీఎం ఖాతా గడువు ముగిసిందని ఫోన్ చేస్తూ... వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలని అడుగుతున్నారని తెలిపారు. 24 గంటల్లో మీ ఖాతా బ్లాక్ అవుతుందని సంక్షిప్త సమాచారం పంపుతుంటారని చెప్పారు. ఇటువంటి మేసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని... ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని కోరారు.
సైబర్ నేరగాళ్ల మోసాల కొత్త పంథా - cybercrime scams news at visakha
సైబర్ నేరగాళ్లు మోసాల విషయంలో కొత్త పంథాలను ఎంపిక చేసుకుంటున్నారని విశాఖ పోలీసులు తెలిపారు. పేటీఎం కేవైసీ పేరిట జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
సైబర్ నేరగాళ్ల మోసాల కొత్త పంథా