ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకుడు బావి ఉపాయం... కరవును తరిమే ఆయుధం - ఇంకుడు బావి ఉపాయం... కరవను పారదోలే ఆయుధం

చుక్కచుక్కనూ ఒడిసి పట్టాలన్న సంకల్పం. వాన నీటిని మించిన వనరు ఎక్కడా లేదన్న నమ్మకం. భూమి దాహాన్ని తీర్చితే కరవు రాదన్న ఆలోచన. వెలసి ఆ విశ్రాంత ఆచార్యుడిని భూగర్భ జలంపై పని చేసే దిశగా నడిపించింది. వేల మందిలో నీటి విలువపై స్పృహ కల్పించే దిశగా కదిలించింది.

నీటి సంరక్షకుడు

By

Published : Jul 17, 2019, 12:53 AM IST

ఇంకుడు బావి ఉపాయం... కరవును తరిమేసే ఆయుధం

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు వెంకటేశ్వర రావు జల సంరక్షణ దిశగా సాగిస్తున్న పయనం ఇప్పుడు ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. జియో ఇంజినీరింగ్ విభాగంలో ఆచార్యుడిగా పని చేస్తూ దశాబ్దాల క్రితం భూగర్భ జలం గురించి ఆలోచించారు వెంకటేశ్వరరావు. భూమిలోకి చేరుతున్న నీటికంటే అక్కడి నుంచి తోడేస్తున్న జలమే ఎక్కువని గుర్తించారు. అప్పుడేవాన నీటి సంరక్షణ దిశగా తొలి అడుగు వేశారు.

మేడపై పడే వర్షంలో 90 శాతం నీరు భూమిలోకే...

భూగర్భజలాన్ని పెంపొందించుకోవాలన్న స్పృహ అంతగా వ్యాప్తిలో లేని రోజుల్లోనే వెంకటేశ్వరరావు ఇంకుడు బావుల గురించి ఆలోచించారు. ఆ రోజుల్లోనే ఆయన తన నివాసం పరిధిలో... గంటకు పది వేల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకించే విధంగా ఇంకుడు బావిని ఏర్పాటు చేశారు. ఇంటి మేడపై పడే 90 శాతం వర్షపు నీటిని భూమిలోపలికి పంపించడంలో సఫలం అవుతున్నారు. ఏటా సగటును రెండు లక్షల లీటర్ల నీటిని భూ గర్భంలోకి చేరే విధంగా చేస్తున్నామని చెబుతున్నారు.

ఆసక్తి ఉన్నవారికి సలహాలు.. సూచనలు

నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు వెంకటేశ్వరరావు. బావులలోకి వర్షపు నీరు నేరుగా చేరే విధంగా పైపు లైన్లు ఏర్పాటు చేసుకునే దిశగా చుట్టుపక్కల వారిని ప్రోత్సహించారు. పరిశ్రమల్లో జలసంరక్షణ దిశగా వివిధ ప్రణాళికలు అమలు చేయిస్తూ భూదాహార్తిని తీర్చడంలో ముందుంటున్నారు.
చిన్నపాటి నివాస భవనం ద్వారా వచ్చే నీటిని పొదుపు చేస్తేనే ఏటా లక్షల లీటర్ల నీరు భూగర్భంలోకి వెళుతోందన్న విషయం ప్రతి ఒక్కరిలో మేల్కొలుపు కలిగిస్తుందని వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. వాన నీటిని సంరక్షించుకోక పోతే ఎదురయ్యే ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్న ప్రస్తుత పరిస్థితి నుంచి అయినా మార్పు ప్రారంభం కావాలని ఆయన సూచిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details