విశాఖ జిల్లా అనకాపల్లిలో పాత ఇనుము దుకాణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పూడిమడక రడ్డులోని పాత ఇనుము దుకాణంలో కుర్రం అప్పారావు (54) అనే వ్యక్తి పని చేసేవాడు. దుకాణంలోని ఓ కెమికల్ డబ్బాను కొడుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
ఘటనలో అప్పారావు కాళ్లు కాలిపోయాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు. యాజమాని నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.