విశాఖలో తెదేపా నేత ఆడారి కిశోర్ కుమార్ నేతృత్వంలో చంద్రబాబు 69వ పుట్టిన రోజు సందర్భంగా... 69మంది అవయవదానానికి ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అవయవ దానం చేయటం వల్ల మనిషి మరణించిన తర్వాత కూడా జీవించే అవకాశం ఉందని కిశోర్ కుమార్ తెలిపారు. ఇటీవలే మరణించిన ఐదేళ్ల తన కుమారుడు ఆడారి చైతన్య భూషణ్ స్ఫూర్తిగా ఈ యజ్ఞాన్ని చేపట్టామన్నారు. వీటిని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ విశాఖపట్నం ప్రతినిధులకు అందించారు. అవయవ దానం చేసిన వారికి ఈనెల 27న చిన్న జీయర్ స్వామి చేతులమీదుగా గుర్తింపు పత్రాలను అందించనున్నామని తెలిపారు.
అవయవదానానికి ముందుకొచ్చిన 69 మంది తెదేపా శ్రేణులు - chinnajeeyar swamy
ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో 69మంది తెదేపా నేతలు అవయవ దానం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
చంద్రబాబు 69వ పుట్టినరోజు సందర్భంగా 69 మంది అవయవదానం