విశాఖలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. గాజువాక అగనంపూడి టోల్‌గేట్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు........ ఐషర్ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆనందపురం నుంచి తమిళనాడుకు బంగాళదుంపల బస్తాల లోడు కింద గంజాయి ఉంచి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 12వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అగనంపూడి టోల్‌గేట్ వద్ద 1200 కిలోల గంజాయి పట్టివేత - vishakapatnam crime news
విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేట్ వద్ద 1200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అగనంపూడి టోల్‌గేట్ వద్ద 1200 కిలోల గంజాయి పట్టివేత