పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు - vishaka
విశాఖ మన్యం నుంచి తరలిస్తున్న 380 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3821909-934-3821909-1562940821310.jpg)
హర్యానాకు చెందిన రెండు వాహనాల్లో గంజాయి తరలింపుపై.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలో నీలంపేట కూడలి వద్ద మాటు వేసి రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రహస్య అరల్లో నిల్వ చేసి పైన బంగాళదుంపల బస్తాలను వేసినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 380 కిలోల గంజాయి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. గంజాయితోపాటు నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను విచారిస్తున్నారు.