Robbery at contractor's house : నెల్లూరు నగరంలోని న్యూ మిలిటరీ కాలనీలో దోపిడీ ఘటన సంచలనంగా మారింది. తండ్రి, కుమార్తెను కట్టేసి కత్తులతో బెదిరించి దోపిడీ చేశారు. కాంట్రాక్టర్ ప్రసేన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో బంధువులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రసేన్ కుమార్ రెడ్డి కుటుంబం గత కొంత కాలంగా చెన్నైలో నివాసం ఉంటున్నారు. నెల్లూరులోని దోపిడీ జరిగిన ఇంట్లో కొన్ని రోజుల నుంచి సుందరరామిరెడ్డి, ఆయన కుమార్తె వాణి నివాసం ఉంటున్నారు.
కాంట్రాక్టర్ ఇంట్లో దోపిడీ.. భారీగా బంగారం, నగదు అపహరణ - ఏపీ వార్తలు
Robbery at contractor's house : నెల్లూరు నగరంలోని న్యూ మిలిటరీ కాలనీలో దోపిడీ జరిగింది. కాంట్రాక్టర్ మామ, వదినలను నిర్బంధించి దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీలో పాల్గొన్న నలుగురు దుండగులు.. తమను తాళ్లతో కట్టేసి, కత్తులతో బెదిరించి పదిన్నర సవర్ల బంగారు నగలు, భారీగా నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
రాత్రి వీరిద్దరినీ నిర్బంధించి నలుగురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి, కత్తులతో బెదిరించి.. ఇంట్లో ఉన్న ఐదున్నర సవర్ల బంగారు చైన్, మరో ఐదున్నర సవర్ల బంగారు దండ, ఆరు డైమండ్లు పొదిగి ఉన్న రింగ్.. అంతేకాకుండా భారీగా నగదు దోచుకుపోయారు. దోపిడీలో నలుగురు దుండగులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దోపిడీ జరగడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ ప్రసాద్.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: