ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అలాంటప్పుడు మాకు ఈ పదవి ఎందుకు..?' ఎమ్మెల్యే ఎదుట వైకాపా సర్పంచ్ నిరసన - వైకాపా సర్పంచ్ నిరసన

Sarpanch Protest: అధికార పార్టీ అసమర్ధ పాలనను సొంత పార్టీ ప్రజాప్రతినిధులే వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా ఎండగడుతూ తమ అసమ్మతిని తెలియజేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా.. వారికి సేవ చేయలేకపోతున్నామంటూ వాపోతున్నారు.

ఎమ్మెల్యే ఎదుట వైకాపా సర్పంచ్ నిరసన
ఎమ్మెల్యే ఎదుట వైకాపా సర్పంచ్ నిరసన

By

Published : Jun 22, 2022, 5:09 PM IST

ఎమ్మెల్యే ఎదుట వైకాపా సర్పంచ్ నిరసన

Sarpanch Protest on Govt policies: అధికార వైకాపాకు చెందిన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పులివల్లం సర్పంచ్ బాలకృష్ణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతూ మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. సీఎం జగన్​పై ఉన్న అభిమానంతో లక్షలు ఖర్చు చేసి సర్పంచ్​గా గెలిచినా..ప్రజలకు కనీసం తాగునీటి వసతి కల్పించలేకపోతున్నామని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.

తాగునీటి పథకం విద్యుత్ మోటార్ కోసం ముప్పై వేల రూపాయలు కేటాయించాలని మూడు నెలలుగా వేడుకుంటున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు. తమను ఎందుకు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని ఈ పదవి ఎందుకంటూ ఎమ్మెల్యే ఎదుట నిరసనకు దిగారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details