Tirumala Tirupati Devasthanam: తిరుమలలో కైశికద్వాదశి ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలోని.. ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చీపై తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం బంగారు వాకిలిచెంత ఆస్థానాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహిస్తారని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వేకువజామున నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉత్సవాన్ని నిర్వహించారు.
TTD అంగరంగ వైభవంగా తిరుమలలో కైశికద్వాదశి క్రతువు.. - తితిదే ఈవో ధర్మారెడ్డి
TTD: తిరుమలలో కైశికద్వాదశి ఆస్థానాన్ని తితిదే కన్నుల పండువగా నిర్వహించింది. కైశిక ద్వాదశి రోజున నిర్వహించే ఈ క్రతువులో శ్రీనివాసమూర్తి భక్తులకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్వామి వారిని తీరు వీధుల్లో ఊరేగించారు.
శ్రీనివాసమూర్తి
Last Updated : Nov 5, 2022, 4:45 PM IST