TN Police Shoot and Caught AP Accused: తిరుపతి జిల్లాలో తమిళనాడు పోలీసు అధికారులపై కత్తితో దాడికి పాల్పడి పరారయ్యేందుకు ప్రయత్నించాడో నిందితుడు. దీంతో పోలీసులు సినిమా స్ట్రైల్లో అతడిని గన్‌తో షూట్ చేసి పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నామ్‌దార్ హుస్సేన్(34) అనే వ్యక్తిపై పలు దొంగతనాల ఆరోపణలు ఉన్నాయి. అతడిపై తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి సిటీ పోలీస్ స్టేషన్లో 4 కేసులు, హోసూరు పరిధిలోని హడ్కో పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైంది. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఏపీలో రెండురోజుల నుంచి ప్రయత్నించి.. చివరకు నిందితుడు నామ్‌దార్ హుస్సేన్‌ను పట్టుకున్నారు.
రెచ్చిపోయిన స్మగ్లరు.. అడ్డుపడిన పోలీసులు.. కారుతో ఢీకొట్టి పరార్
అతడిపై దొంగతనం కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతడిని తిరుపతి మెజెస్టిక్ అనే ప్రాంతానికి శుక్రవారం తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం వద్ద ఉన్న కత్తిని తీసుకుని.. ఎస్సై సహా ముగ్గురు పోలీసు అధికారుల చేతులు, పొత్తికడుపుపై కత్తితో పొడిచి.. పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఎడమ చేతికి గాయమైన ఎస్సై వినోద్ తన తుపాకీతో నిందితుడి కుడి మోకాలి కింద షూట్ చేసి.. అతడిని పట్టుకున్నారు.
Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!
నిందితుడు పోలీసులు అధికారులపై కత్తితో దాడి చేయటంతో ఎస్సై వినోద్, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, ఫస్ట్ లెవల్ కానిస్టేబుల్ విజియరసుకు గాయాలయ్యాయి. దీంతో ముగ్గురూ హోసూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు నిందితుడు హుస్సేన్‌ను హోసూరు జీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు.. దళిత మహిళపై విచక్షణారహిత దాడి.. దుస్తులు చించి..
మరోవైపు.. ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వైసీపీ నేతలు జ్యోతి అనే మహిళ దుస్తులు చింపి.. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలంలో ఇల్లూరు గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై గ్రామస్థులు పలుమార్లు అడ్డుకున్నారు. అయినా లాభం లేకపోయేసరికి వారు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. ఈ నెల 20వ తేదీన జారీ అయిన ఉత్తర్వులను అధికారులు మాత్రం అమలు చేయలేదు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది.
Teacher Harassment on Student : గణితం చెప్తానని గదిలోకి తీసుకెళ్లి.. ఐదో తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు
దీంతో శుక్రవారం వారిని అడ్డుకునేందుకు రేవు వద్దకు గ్రామస్థులు వెళ్లగా.. వైసీపీకి చెందిన ఇసుక అక్రమ రవాణాదారులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దళిత మహిళ జ్యోతితో పాటు కుళాయి రెడ్డి, రఘునాథ్ రెడ్డి అనే రైతులు గాయపడ్డారు. వీరి దుస్తులను చించి.. విచక్షణారహితంగా కొట్టారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం వల్ల పంటలు కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంపై గనులు, భూగర్భశాఖ డీడీ వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా.. ఇల్లూరు రేవులో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినట్లు అంగీకరించారు. న్యాయస్థానం ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలిపారు.
Attack on Young Woman for Refusing Love: ప్రేమను నిరాకరించిందని.. నడిరోడ్డుపై యువకుడి దాడి.. తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలు