గూడూరులో రెచ్చిపోయిన విద్యార్థులు.. కత్తులతో ఫైటింగ్ - Clashes between students in tirupati
15:39 May 24
కత్తులతో కళాశాలలోకి వెళ్లిన ముగ్గురిని చితకబాదిన విద్యార్థులు
Clashes between students at Gudur: తిరుపతి జిల్లా గూడూరు ఆదిశంకర కళాశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. కళాశాలలో ఇరు వర్గాలు ఘర్ణణకు దిగాయి. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి మద్దతుగా బయటనుంచి ముగ్గురు వ్యక్తులు కత్తులతో కళాశాలకు వచ్చారు. దీంతో బయటనుంచి వచ్చిన వారిని కళాశాల విద్యార్థులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన పోలీసులు.. ఘర్షణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు చేశారు.
గూడూరులోని జాతీయరహదరిపై ఉన్న ఆదిశంకర కళాశాల విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. విద్యార్థులు కొట్టుకోవడం భయబ్రాంతులకు గురి చేసింది. ఇంత జరుగుతున్నా కాలేజి యాజమాన్యం మాత్రం పట్టించుకోడంలేదు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాదాపుగా రెండు నెలల కాలంలో ఇలా గొడవ జరగడం మూడోసారి.
ఇదీ చదవండి: