Sandalwood smuggling in seshachalam: గత కొంతకాలంగా తిరుపతి జిల్లాలోని శేషాచల అడవుల్లో స్తబ్దతగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పందాతో స్మగ్లింగ్ ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లర్లురూటు మార్చారు. ఈ సారి కొత్త తరహా స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. సుమారు కోటి రూపాయలు విలువైన ఎర్రచందనంను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శేషాచల అడవుల్లోనే దుంగలను కట్ చేసి రీఫర్లుగా చెక్క ముక్కలను పొడిగా తయారుచేసి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే...
Red Sandal Smuggling: కొత్త తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్..ఈసారి ఎలా అంటే..!
sandalwood smuggling in AP: ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త తరహాలో స్మగ్లింగ్‌కు తెరలేపారు. తిరుపతిలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. అందులో 72 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు వందల కేజీల ఎర్రచందనం పొట్టును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పొట్టును తరలిస్తే ఏవిధమైన అనుమానం రాదనే కారణంతో దుంగల్ని పొట్టుగా మార్చి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం చెక్కలు, పొడిగా చేసి తరలింపు:తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం బోడెవాండ్లపల్లె సమీపంలో సాయికాడ గుట్టు వద్ద ఎర్రచందనం చెక్కలు, పొడి ముక్కలను లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తిరుపతి డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు రెండు కార్లు ఒక లారీ స్వాధీనం చేసుకుని 5మందిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. పట్టుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ తరహా స్మగ్లింగ్ ఇదే మొదటి సారి అని ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన స్మగ్లర్లలో తమిళనాడుకు చెందిన మహమ్మద్ రసూల్, కార్తీక్ భాస్కరన్, జేసురాజ్ లతో పాటు... అన్నమయ్య జిల్లా సిద్దారెడ్డిపల్లి చెందిన తిరుమల శెట్టి నాగరాజు, వీరబల్లికి మండలానికి చెందిన అమరేంద్ర రాజులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో మహమ్మద్ రసూల్ పై ఇప్పటికే 25 కేసులతో పాటుగా... పీడీ యాక్ట్ నమోదై ఉందన్నారు. స్మగ్లర్లు సమాచారంతో ఢిల్లీలో ఉన్న ఇద్దరు బడా స్మగ్లర్ల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ యశ్వంత్ చెప్పారు.
బాక్రాపేట సీఐ, యర్రావారిపాళెం ఎస్ఐ ఇద్దరూ నిన్న ... కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానంగా ఉన్న లారీని తనిఖీ చేస్తే అందులో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనలో మెుత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. చెక్క దుంగల్ని గృహోపకరణాలుగా మార్చి తరలిస్తున్నారు. నార్మల్ చెక్క దిమ్మెల్లా కనిపించేలా చేసి తరలిస్తున్నారు. అందులో ఎర్రచందనం చెక్కపొట్టును సైతం తరలిస్తున్నారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు రెండు కార్లు ఒక లారీ స్వాధీనం చేసుకున్నాం. పట్టుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుంది. మెుత్తం చెక్క దిమ్మెల బరువు నాలుగు వందల కేజీలు ఉంది. చెక్కపొడి మూడు వందల కేజీలు ఉంటుంది. -యశ్వంత్, తిరుపతి డీఎస్పీ