ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KVS Bhaskar: "అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి".. ఎన్‌వీఎస్‌ 01 ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయగాథ

KVS Bhaskar: నిన్న శ్రీహరికోటలోని సతీష్​ ధవన్​ స్పేస్​ సెంటర్​ నుంచి నింగిలోకి ప్రవేశపెట్టిన ఎన్​వీఎస్​-01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీఎస్‌ భాస్కర్‌.. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం.

By

Published : May 30, 2023, 12:29 PM IST

KVS Bhaskar
KVS Bhaskar

NVS 01 Satellite Project Director KVS Bhaskar: "నావిగేషన్ ఉపగ్రహం ఎన్​వీఎస్-01 తయారు చేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఇందులో యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్తలు భాగస్వాములు అయ్యారు. అటామిక్ క్లాక్ తయారీకి ఎక్కువ సమయం పట్టింది. ఇక నుంచి ఆరు నెలలకు ఒకసారి నావిగేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నాం" ఈ మాటలన్నది మన తెలుగు బిడ్డ కేవీఎస్ భాస్కర్. షార్లో సోమవారం విజయవంతంగా నిర్వహించిన జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగంలో ఈయన తనవంతు పాత్ర పోషించారు.

ఎన్​వీఎస్-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ కేవీఎస్ భాస్కర్.. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని అంతరిక్ష కేంద్రీయ పాఠశాలలో చదువుకున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన గణపతిరావు, సుబ్బులక్మి దంపతుల కుమారుడు కేవీఎస్​ భాస్కర్. గణపతిరావు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేశారు. ఆ సమయంలో భాస్కర్ ఇక్కడి పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్నారు. భాస్కర్​.. చదువుకునే సమయం నుంచి రాకెట్ ప్రయోగాలపై మక్కువ చూపారు. అప్పుడే తను శాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నారు.

"నావిగేషన్‌ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-01 తయారు చేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఇందులో యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు భాగస్వాములు అయ్యారు. అటామిక్‌ క్లాక్‌ తయారీకి ఎక్కువ సమయం పట్టింది. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి నావిగేషన్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నాం."-కేవీఎస్​ భాస్కర్​, ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌

ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఇంటర్ పూర్తి చేసి, దుర్గాపూర్​ ఆర్​ఈసీ(ఎన్​ఐటీ)లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివారు. అనంతరం బిట్స్ పిలానీలో ఎంటెక్(ఎలాక్ట్రానిక్స్​ అండ్​ కంట్రోల్​ సిస్టమ్​) పూర్తి చేశారు. ఆపై 1990లో బెంగుళూరులోని యూఆర్​రావు శాటిలైట్ సెంటర్​లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా కష్టపడి ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తాజాగా ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌వీఎస్‌ సిరీస్‌లో జరగనున్న నాలుగు ప్రయోగాలూ భాస్కర్‌ సారథ్యంలోనే జరగనున్నాయి.

అసలేమిటి ఎన్​వీఎస్​-01: తిరుపతి జిల్లాలోని షార్​ నుంచి రెండో తరం నావిక్‌ ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్‌వీఎస్‌ 01 శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సుమారు 2వేల 232 కిలోల బరువున్న ఈ ఉపగ్రహ జీవితకాలం 12 సంవత్సరాలు. భారత్‌ ప్రధాన భూభాగం చుట్టూ 15 వందల కిలోమీటర్ల పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను ఇది అందిస్తుంది. ఈ ఉపగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో రుబిడియం అణుగడియారం ఉంది. అతి తక్కువ దేశాల వద్దే ఉన్న ఈ సాంకేతికతను భారత్‌ సొంతంగా అహ్మదాబాద్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసింది.

ABOUT THE AUTHOR

...view details