Tribute to forest officials: ఎర్రచందనం దొంగలకు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు సహకరించడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక బాధ్యతగా భావించి.. అలాంటి వాటికి అటవీశాఖ ఉద్యోగులు, రాజకీయ నేతలూ.. దూరంగా ఉండాలని సూచించారు. తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. రానున్న రోజుల్లో జూ పార్క్‌లను అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తామన్నారు.
'ఎర్ర చందనం స్మగ్లర్లకు నాయకులు, అధికారుల సహకారం దురదృష్టకరం' - about Tribute to forest officials
Minister Peddireddy Ramachandra Reddy: స్మగ్లర్లతో పోరాడుతూ 23మంది అటవీ సిబ్బంది ప్రాణాలు త్యాగం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎర్రచందనం దొంగలకు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు సహకరించడం దురదృష్టకరమన్నారు.
Peddireddy Ramachandra Reddy