Janasena leader Kiran Royal : మంత్రి రోజా ప్రమేయంతో నగరి పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. తనను నెంబర్ లేని వాహనంలో.. తనపై దాడి చేస్తూ ఓ టెర్రరిస్టును తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఏదైనా ఉంటే ముఖాముఖి చర్చలకు రావాలే గాని.. ఇలా తన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలా తీసుకెళ్లడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. స్టేషన్ కి తీసుకెళ్లిన పోలీసులు ఏ కేసు పెట్టాలో కూడా తెలియకుండా దాదాపు పది పేపర్లు రాసి చించారని.. చివరికి నాన్ బైయిలబుల్ కేసును నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారన్నారు. మంత్రి రోజాపై అధికార, చట్ట దుర్వినియోగం కేసు పెడతామన్నారు.
మంత్రి రోజా పై అధికార, చట్ట దుర్వినియోగం కేసు పెడతాం.. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ - nagari
Janasena leader Kiran Royal : మంత్రి రోజాపై అధికార, చట్ట దుర్వినియోగo కేసు పెడతామన్నారు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి రోజా ప్రమేయంతో నగరి పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. వైకాపా పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన నాయకుడు కిరణ్ రాయల్