HC ON MOHANBABU PETITION : ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను.. 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు.. మంచు మోహన్‌బాబుకు హైకోర్టులో ఊరట - హైకోర్టు తీర్పు
HERO MOHANBABU : సినీ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలు నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది.
HC ON MOHANBABU PETITION
2019 మార్చి 22వ తేదీన అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని మోహన్ బాబు కుటుంబం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కోడ్ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: