Dispute Between Tollgate staff And Students: తమిళనాడుకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు తిరుపతిలోని లా కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పరీక్షలు రాసిన ఓ విద్యార్థి వడమల పేట టోల్గేట్ వద్దకు చేరుకున్నాడు. టోల్ ఛార్జీలు చెల్లించకుండానే తనను పంపాలని అతను సిబ్బందితో అన్నాడు. కుదరదని సిబ్బంది చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో మాట మాట పెరిగి లా విద్యార్థి, సిబ్బంది దాడి చేసుకున్నారు.
విద్యార్థులకు టోల్గెేట్ సిబ్బందికి వివాదం.. కార్లపై దాడి చేసిన సిబ్బంది..
Dispute: తిరుపతి జిల్లా వడమల పేట టోల్గేట్ వద్ద తమిళనాడుకు చెందిన లా కళాశాల విద్యార్థులకు టోల్గేట్ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నాలుగు కార్లను టోల్గేట్ సిబ్బంది ధ్వంసం చేశారు. విద్యార్థులకు సిబ్బందికి మధ్య మాట మాట పెరగడంతో వివాదం ముదిరింది. చివరికి పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. అసలు వివాదానికి కారణం ఎంటంటే..
దీంతో వెనుక వస్తున్న విద్యార్థులందరూ అక్కడకు చేరుకున్న తర్వాత.. టోల్గేట్ వద్ద తమను ఉచితంగా పంపాలని ఘర్షణకు దిగారు. అలా కుదరదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది, విద్యార్థుల మధ్య మాట పెరిగింది. దీంతో సిబ్బంది విద్యార్థులకు చెందిన నాలుగు కార్లపై దాడి చేశారు. ఈ ఘర్షణతో తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వడమాల పేట ఎస్సై రామాంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన వివరాల పై ఆరా తీశారు. అనంతరం ఇరు వర్గాలకు నచ్చచెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
ఇవీ చదవండి: