ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM TOUR: 23న తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన.. - తిరుపతి జిల్లా తాజా వార్తలు

CM TOUR: ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వకుళామాత ఆలయంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.

cm tour
cm tour

By

Published : Jun 21, 2022, 9:52 AM IST

CM TOUR: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న తిరుపతి జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 10.45 గంటలకు రేణిగుంటకు సీఎం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో పేరూరు చేరుకుని.. 11.15 నుంచి 11.45 గంటల మధ్య వకుళామాత ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత హెలికాప్టర్‌లో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.05 నుంచి 12.35 గంటల మధ్య హిల్‌ టాప్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌(అపాచీ) పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల మధ్య రేణిగుంట ఈఎంసీ క్లస్టర్‌లో టీసీఎల్‌, సన్నీ, ఆప్టో టెక్నాలజీస్‌, ఫాక్స్‌ లింక్స్‌కు సంబంధించి ప్రారంభం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం వెళ్తారు’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు.

వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

తిరుపతిలో వకుళమాత ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆహ్వానించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details