ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారావారిపల్లెలో అభిమానులు, కార్యకర్తలను పలకరించిన చంద్రబాబు... - TDP fans and activists in Naravaripalli

Chandrababu greeted TDP activists: నారావారిపల్లెలో నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. బాబును చూడటానికి కార్యకర్తలు, అభిమానులు రావడంతో వారిని పలకరించేందుకు బయటకు వచ్చిన ఆయన కొంతసేపు వారితో ముచ్చటించారు. వారి వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించే దిశగా కృషిచేస్తాని చంద్రబాబు వెల్లడించారు.

Chandrababu greeted TDP fans
చంద్రబాబు

By

Published : Jan 14, 2023, 10:33 PM IST

Chandrababu greeted TDP fans: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని స్వగ్రామం నారావారిపల్లెలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచి కార్యకర్తలు, నాయకులను చంద్రబాబు కలుస్తూనే ఉన్నారు. ఈ పండగకు పూర్తిగా కుటుంబంతో గడపాలనుకున్న చంద్రబాబుకి... రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సందడి ఎక్కువ అవడంతో ఎప్పటికప్పుడు సమయం కేటాయిస్తూ వచ్చాడు.

ఈరోజు రాత్రి 7:10 సమయంలో కార్యకర్తలు ఎక్కువ మంది రావడంతో పార్టీ చంద్రగిరి నియోజకవర్గ బాధ్యుడు పులివర్తి నాని విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనితో చంద్రబాబు.. కార్యకర్తల కోరిక మేరకు ఇంటి ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు వచ్చి వారికి అభివాదం చేశాడు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారి వద్ద నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించాడు. అరగంటకు పైగా కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, మనమంతా కలసికట్టుగా శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details