ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లింట విషాదం... బైక్ పైనుంచి జారిపడి మహిళ మృతి - srikakulam district latest news

నాలుగు రోజుల్లో కుమార్తె పెళ్లి... ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి ఆ ఇంటి పెద్ద మృతి చెందారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా గుల్ల సీతారాంపురంలో జరిగింది.

women death to skid from bike in gulla seetharampuram ananthapuram district
బైక్ పై నుంచి జారిపడి మహిళ మృతి

By

Published : Dec 12, 2020, 7:45 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురంలో ద్విచక్ర వాహనం పైనుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. సంతకవిటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్​వోగా విధులు నిర్వహిస్తున్న సరోజినీ... తన భర్త ప్రదీప్​తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా... గుల్ల సీతారాంపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సరోజినీ బైక్ పైనుంచి జారిపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 16న సరోజినీ కుమార్తె వివాహం జరగనుంది. కుమార్తె వివాహం చూడకుండానే మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details