Secretariat employees concerned: తమ ప్రొబేషన్ డిక్లరేషన్ జూన్ 30వ తేదీలోగా చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మేం గెలవడానికి కాదని, బతకడానికి పోరాడుతున్నామని ఆందోళన చేపట్టారు. రెండేళ్ల శిక్షణ కాలం పూర్తయినా.. క్రమబద్ధీకరించలేదంటూ నిరసన వ్యక్తంచేశారు.
Secretariat employees concerned: 'మేం గెలవడానికి కాదు.. బతకడానికి పోరాడుతాం' - సచివాలయ ఉద్యోగుల నిరసన ర్యాలీ
Secretariat employees concerned: వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ప్రొబేషనరీ డిక్లరేషన్.. 8 నెలలు పొడిగించటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. విధులను బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యారు. రెండేళ్ల శిక్షణ కాలం పూర్తి అయినా.. ఇంకా క్రమబద్ధీకరించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు.
Secretariat employees concerned
జులై 1 నుంచి పే స్కేల్ అమలు నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని.. జనవరి నుంచి పెంచిన జీతాలు ఇవ్వాలని కోరారు. పీఆర్సీ సైతం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉదయం నుంచే కొత్తూరు మండలంలోని అన్ని సచివాలయాల సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి:Protest: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన