విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటై 35 ఏళ్లు అయినప్పటికీ.. నేటికీ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొరియా దేశానికి సంబంధించిన పొసోకోకు.. విశాఖ ఉక్కును అప్పగించి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుని కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలాన్ని ప్రైవేట్ పరిశ్రమలకు కేటాయించకుండా.. పార్లమెంటులో ప్రస్తావించాలని కోరారు.
'ఎంపీ గారూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడండి' - ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అప్డేట్
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కలిశారు. తమకు ఇచ్చిన హమీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ వద్ద వాపోయారు.
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు