శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో వర్షాలు కురవాలంటూ...లావేరు మండలం తామాడ పంచాయతీ పరిధిలోని కొత్త, పాత రౌతు పేట, తామాడ గ్రామాలకు చెందిన రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు 5 కిలోమీటర్ల మేర నడుచుకొని కొండపైకి వెళ్లి...వేద పండితులు మంత్రోచ్ఛరణాల మధ్య...వరుణు దేవుడికి సహస్ర నామర్చన, వరుణు జపం, అభిషేకాలు చేశారు. వరద పాశం వండి కొండ రాళ్లపై పోసిన అనంతరం ప్రజలు గ్రామస్థులంతా ప్రసాదాన్ని స్వీకరించారు.
'వరద పాశం రాళ్లపై తింటేనే వర్షాలు కురిసేది' - srikakulam
శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురవాలని రైతులు పూజలు చేశారు. ప్రజలు 5 కిలోమీటర్ల మేర నడుచుకొని కొండపైకి...వెళ్లి వరుణు దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరద పాశం వండి కొండ రాళ్లపై పోశారు.
వర్షం కురవాలని పూజలు చేస్తున్న గ్రామస్తులు