వంశధార, నాగావళి నదులకు భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో... నిన్నటి నుంచి నదులు ఏకధాటిగా ప్రవహిస్తున్నాయి. హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్నందున... మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొట్టా బ్యారేజీ ఔట్ ఫ్లో లక్షా 11 వేల 210 క్యూసెక్కులుగా ఉంది. వంశధారకు వచ్చిన నీటిని వచ్చినట్లు... అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు వస్తున్న వరద నీటితో... నాగావళి నది తొణికిసలాడుతోంది. తోటపల్లి జలాశయం ఇన్‌ఫ్లో 42 వేల 579.. ఔట్‌ఫ్లో 50,611 క్యూసెక్కులుగా ఉంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.... అధికారులు హెచ్చరించారు. పరివాహక ప్రాంతంలో వీఆర్వోలు అందుబాటులో ఉండాలని.... కలెక్టర్ నివాస్ ఆదేశించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.
ఉగ్రరూపంలో వంశధార, నాగావళి.. మూడో హెచ్చరిక జారీ - water
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో... వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
vamsadhara-nagavali-water-flow