ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు పెళ్లిళ్లు.. అయినా కలిసి బతకాలని కట్టుదాటారు.. కానీ - gangaram latest news

మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఓ జంట రైలు కింద పడి బలవన్మరణానానికి పాల్పడింది. ఇద్దరికీ వివాహమైనప్పటికీ వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కలిసి బతుకుదామని ఇంటి నుంచి బయటికెళ్లిన వారు రైలు పట్టాల కింద పడి చనిపోయారు. రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

suicide
suicide

By

Published : Nov 13, 2021, 7:11 AM IST

వారిద్దరికీ వేర్వేరు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలూ ఉన్నారు. కానీ.. వారి పరిచయం హద్దులు దాటింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. కఠిన నిర్ణయం తీసుకున్నారు.. కట్టుదాటారు! కలిసి బతుకుదామని మూడు నెలల క్రితం ఊరు విడిచివెళ్లారు. అయితే.. తాజాగా ఊహించని వార్త. వారిద్దరూ మృతిచెందారు! పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

కోటబొమ్మాళి మండలం గంగరాం గ్రామ సమీపంలో రైల్వేలైనుపై శుక్రవారం ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వీరు జలుమూరు మండలానికి చెందిన కుంచి శంకరరావు(40), వెలమల యశోద(32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరగ్గా.. ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నారు.

మూడు నెలల క్రితం గ్రామం నుంచి అదృశ్యమైన వీరు ఈ విధంగా విగతజీవులుగా.. కనిపించడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదంలో మునిగాయి. పలాస రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Suicide Attempt: హైదరాబాద్​లో మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన యువతి

ABOUT THE AUTHOR

...view details