two lorries colluded: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు కూడలి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆయిల్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ ఓ దాబా దగ్గర ఆపాడు. అదే రోడ్డులో వెనక నుంచి చేపల లోడుతో కలకత్తా వెళ్తున్న మరో లారీ ఆగివున్న ఆయిల్ లారీని ఢీకొంది. అనంతరం కల్వర్టును ఢీకొట్టి... ఓ షాపులోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా బ్యాటరీల్లో మంటలు వ్యాపించి లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది.
సకాలంలో స్పందించి...
two lorries colluded: దాబాలో ఉన్నవారు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లారీలో చిక్కుకున్న డ్రైవర్ మున్న, క్లినర్ సాయినాథ్ అనే ఇద్దరిని బయటకు తీశారు. లారీలో ఉన్న నూనె విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని లారీ డ్రైవర్ తెలిపారు. ఇందులో సగానికి పైగా నూనె రోడ్డు పాలయిందని వాపోయాడు. గాయపడిన డ్రైవర్, క్లీనర్లను 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Suicide: కర్నూలులో దారుణం.. ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి