ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు'

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకోటి రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 2 నాటికి అన్ని శిక్షణ కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

By

Published : Oct 31, 2020, 8:57 PM IST

thirty skill development training Centers
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు

రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకోటి రెడ్డి తెలిపారు. ఒక్కో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన మీడియాతో వివరించారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పులివెందులతో పాటు ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఆవరణల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details