ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడోదశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

By

Published : Feb 16, 2021, 5:58 PM IST

శ్రీకాకుళం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొమ్మిది మండలాల్లోని 248 సర్పంచ్‌ స్థానాలకులకు రేపు ఎన్నిక జరగనుంది. 2,671 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నిక కోసం 5 వేల 7 వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన అధికారులు.. ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Third phase panchayat elections
శ్రీకాకుళం జిల్లాలో మూడోదశ పంచాయతీ ఎన్నికలు

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. నిన్న సాయంత్రం ఐదు గంటలతో మూడోదశ ప్రచారానికి గడువు ముగిసింది. గ్రామాల్లో అభ్యర్థులు జోరుగా ర్యాలీలు నిర్వహించి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గుర్తులతో వినూత్నంగా ఇంటింటి ప్రచారం సాగించారు. ఆమదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలకు రేపు పోలింగ్ జరగనుంది. 293 గ్రామ పంచాయతీల్లోని సర్పంచులతో పాటు 2,648 వార్డు స్థానాలకు ప్రకటన ఇచ్చారు. వాటిలో 45 సర్పంచ్‌లతో పాటు 947 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా భద్రతా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా.. పోలీసులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండీ...రేపు మూడో దశ పంచాయతీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details