ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొల్లులో అన్నమయ్య 111వ జయంతి వేడుకలు.. - Palakkol templ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య 111వ జయంతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమ్యయ్య వంశీకులు పాల్గొన్నారు.

The Annamayya 111th Jayanti Vaibhav was held in the Palakkol temple premises of West Godavari district.

By

Published : Aug 5, 2019, 2:54 PM IST

పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య 111వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు తాళ్లపాక శివధరవికుమార్ ఆచార్యులు, తాళ్లపాక సందీప్ కుమార్​లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..తాళ్ళపాక అన్నమాచార్యులు విశిష్టత, కీర్తన గురించి వివరించారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అన్నమాచార్య కీర్తనలు సంగీతం నృత్య పోటీలు నిర్వహించారు. గౌరీ శంకర్ సంగీతం అకాడమీ గౌరవ అధ్యక్షుడు అయినాల సూర్యనారాయణ మూర్తి,అధ్యక్షుడు మద్దాల వాసు,ఉపాధ్యక్షులు కె.ఎస్.పి.ఎన్ శర్మ విజేతలకు బహుమతులు అందజేశారు.

పాలకొల్లులో అన్నమయ్య 111వ జయంతి వేడుకలు..

ABOUT THE AUTHOR

...view details