ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా..? ఎంపీ రామ్మోహన్ నాయుడు

రామతీర్థం ఘటన నిందితులను పట్టుకోని ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వారిపై కేసులను నమోదు చేయడమేంటని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రాజాంలో మాజీ మంత్రి కళాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

mp rammohan naidu
mp rammohan naidu fiers on ycp govt

By

Published : Jan 22, 2021, 8:53 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కళావెంకట్రావును ఎంపీ రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే స్పందించని ప్రభుత్వం... ప్రశ్నిస్తున్న తెదేపా నేతలపై కేసులు పెడుతోందని అన్నారు. ఇందుకు కారణం ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డే అని వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకోకుండా... విజయసాయిరెడ్డిపై చెప్పులు విసిరిన ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించకుండా గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details