వైకాపా నుంచి తెదేపాలోకి పెద్ద ఎత్తున వలసలు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట ఏజెన్సీలో వైకాపా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెదేపాలో చేరారు. 500 కుటుంబాలు పాలకొండ శాసనసభ అభ్యర్థి కృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా సీతంపేట సంత గోడల నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తెదేపా అమలు చేస్తున్న విధానాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరారని కృష్ణ అన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో తాను కృషి చేస్తానన్నారు.
ఇవి చూడండి...