శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్‌లో తెదేపా నేత కూన రవికుమార్ లొంగిపోయారు. ఎనిమిదో తేదీన జరిగిన ఎంపీటీసీ ఎన్నికల రాత్రి జరిగిన వివాదం విషయంలో పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల రోజున కూనరవి స్వగృహం పెనుబర్తిలో వివాదం జరిగింది.పెనుబర్తి పంచాయతీ అలమాజీపేటకు చెందిన తెదేపా వర్గీయులు ఇద్దరు స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా... వైకాపా వర్గీయులు దాడి చేశారు. దీంతో తెదేపా, వైకాపా వర్గీయులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలకు చెందిన 17 మందిపై పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పొందూరు పీఎస్‌లో లొంగిపోయిన తెదేపా నేత కూన రవికుమార్ - కూన రవికుమార్ తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్లో తెదేపా నేత కూన రవికుమార్ లొంగిపోయారు. ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ రోజు రాత్రి కూన రవి స్వగృహం పెనుబర్తిలో వివాదం జరగగా.. పొందూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో పలువురిపై వారు కేసుపెట్టారు.
పోలీసుల అదుపులో తెదేపా నేత కూన రవికుమార్
ఈ కేసు విషయంలో శ్రీకాకుళంలోని కూన రవికుమార్ ఇంటి వద్ద శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. కూన రవికుమార్ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే ఈరోజు ఉదయం పొందూరు పోలీసుస్టేషన్‌లో రవికుమార్ లొంగిపోయారు. దీంతో రాజాం కోర్టులో పోలీసులు కూన రవిని హజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే లొంగిపోయిన అందరికీ బెయిల్ మంజూరు అయ్యింది
ఇదీ చూడండి.ఐదురోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఐడీ సోదాలు
Last Updated : Apr 15, 2021, 2:02 PM IST
TAGGED:
penubarthi conflict