ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్యా రాజకీయాలు చేయను.. అలా చేసేవారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తా: చంద్రబాబు - TDP Cheif Chandrababu tours news

TDP chief Chandrababu Naidu made sensational comments on YS Jagan: ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి.. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసి.. ప్రజలు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకువచ్చిన మతిస్థిమితం లేని ఈ సైకో ముఖ్యమంత్రిని.. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Chandrababu_ Fire_ on_Cm_Jagan
Chandrababu_ Fire_ on_Cm_Jagan

By

Published : Aug 10, 2023, 9:28 PM IST

Updated : Aug 11, 2023, 6:29 AM IST

ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించేందుకు నేను సిద్ధంగా లేను: చంద్రబాబు

TDP chief Chandrababu Naidu made sensational comments on YS Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై జగన్ కపట ప్రేమ చూపుతూ, మొసలి కన్నీరు కారుస్తున్నాడని ధ్వజమెత్తారు. మతిస్థిమితం లేని ఈ సైకో ముఖ్యమంత్రి.. కోడికత్తి కేసు నిందితుడిని (శ్రీను) చంపించి తనపైకి నెడతాడేమోనని దుయ్యబట్టారు. తాను హత్యా రాజకీయాలు చేయను కానీ.. అలా చేసేవారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Yudhabheri tour completed 10 days: 10రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు పర్యటన..'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో ఈ నెల 1వ తేదీన చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 రోజులు పూర్తి చేసుకున్న ఈ యుద్ధభేరి పర్యటన నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఈ 10వ రోజున శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనభద్రలో చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వంశధార ప్రాజెక్టును పరిశీలించి..సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అనంతరం రైతులు, మేధావులతో కలిసి.. టీడీపీ హయంలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన నిధుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Chandrababu Condemned YSRCP Attack on Police Station: 'ఏపీలో పోలీసులకూ రక్షణ లేదు'.. పోలీస్ స్టేషన్​పై వైసీపీ దాడిని ఖండించిన చంద్రబాబు

Chandrababu Fire on YSRCP: టీడీపీ హయంలో 41శాతం పనులు పూర్తి.. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..''విజయనగరం జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 9 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం పడే జిల్లా శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళంలో పడే సగం వర్షపాతం అనంతపురం జిల్లాలో పడుతుంది. తెలుగుదేశం పార్టీ హయంలో తారకరామ తీర్థ సాగరం రిజర్వాయర్‌కు రూ.104 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ జగన్ ప్రభుత్వం కేవలం రూ.57 కోట్లే ఖర్చు చేసింది. తారకరామ తీర్థ సాగరం పనులు తెలుగుదేశం హయంలోనే 41 శాతం పనులు పూర్తయ్యాయి. మద్దువలస రిజర్వాయర్‌కు టీడీపీ రూ.3.26 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ వైఎస్సార్సీపీ రూ.1.3 కోట్లే ఖర్చు చేసింది. తోటపల్లి బ్యారేజ్‌కు టీడీపీ హయాంలో రూ.237 కోట్లు ఖర్చు చేస్తే.. సైకో జగన్ ప్రభుత్వం రూ.12 కోట్లే ఖర్చు పెట్టింది. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారో..? చెప్పాలని జలవనరుల శాఖ మంత్రికి సవాల్‌ విసురుతున్నా. గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌కు టీడీపీ రూ.49.75 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ ప్రభుత్వం రూ.4.71 కోట్లు ఖర్చు చేసింది. నాగావళి-వంశధార అనుసంధానానికి వైఎస్సార్సీపీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు'' అని ఆయన అన్నారు.

Chandrababu's Harsh Comments on Jagan: టీడీపీ హయంలో 41శాతం పనులు పూర్తి.. ఉత్తరాంధ్రపై జగన్ మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపుతూ, మొసలి కన్నీరు కారుస్తున్నాడని.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తారకరామ తీర సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు 41శాతం పనులు పూర్తయితే.. ఇప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. మద్దువలస రిజర్వాయర్ స్టేజ్ 2 పనులు ప్రీక్లోజ్ చేసేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో హరికథలు చెప్పే మంత్రులు ఉన్నారు కానీ.. తోటపల్లి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. వంశధార ప్రాజెక్ట్ స్టేజ్-2 (కుడి ప్రధాన కాల్వ) ఫేస్-2 గత 4 ఏళ్లలో పనులు పూర్తి చేయకపోగా.. నిర్వాసితులకు, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లించలేదని చంద్రబాబు మండిపడ్డారు.

TDP Chief Chandrababu Selfie Challenge at Thotapalli Project: తోటపల్లి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

Jagan Kodikatti Case: కోడికత్తి కేసు నిందితుడిని చంపిస్తారేమో..! 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. మతిస్థిమితం లేని ఈ సైకో ముఖ్యమంత్రి.. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుని కూడా చంపించి, తనపైకి నెడతాడేమోనని ధ్వజమెత్తారు. ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించేందుకు తాను సిద్ధంగా లేనని వ్యాఖ్యానించారు. పోలీసులు రాజకీయ పార్టీలపైనా, ప్రజలపైనా పడటం న్యాయమా..? అని నిలదీశారు. తాను హత్యా రాజకీయాలు చేయను కానీ అలా చేసేవారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి..యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసి.. ప్రజలకు, రైతులకు వేరేదారి లేకుండా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. మతిస్థిమితం లేని పిచ్చోడినే ఊరి సర్పంచ్‌గానే గెలిపించం.. అలాంటిది ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామా..? రివర్స్ నిర్ణయాలతో సాగునీటి రంగాన్ని ఈ సైకో ముఖ్యమంత్రి హత్య చేశాడు. శాంతి భద్రతల్ని పూర్తిగా చంపేసి.. రాష్ట్ర భవిష్యత్తునే తాకట్టు పెట్టాడు. ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించేందుకు నేను సిద్ధంగా లేను.-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

TDP Cheif Chandrababu Projects Tour: ఉత్తరాంధ్రలో 13 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: చంద్రబాబు

Last Updated : Aug 11, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details