State Fisherman Union Protest In Srikakulam : జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలను గంగలో కలిపేసారని రాష్ట్ర మత్స్యకారుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని.. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు వైకాపా ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసిన వీరు.. మత్స్యకారుల మంత్రి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.
మత్స్యకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ.. శ్రీకాకుళంలో నిరసన
State Fisherman Union: శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి సమీపంలో.. రాష్ట్ర మత్స్యకారుల సంఘం ప్రతినిధులు నిరసన చేపట్టారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఫ్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.
State Fisherman Union Protest