ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగ్రచెర వీడి స్వదేశానికి చేరిన శ్రీకాకుళం వాసులు - ఉగ్రచెర నుంచి శ్రీకాకుళం వాసులకు విముక్తి

లిబియా దేశంలో 28 రోజులపాటు ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉండి, విడుదలైన ముగ్గురు శ్రీకాకుళం జిల్లా వాసులు స్వదేశానికి చేరుకున్నారు. ఇవాళ వారి స్వగ్రామాలకు చేరుకుని అవకాశం ఉంది. గత సెప్టెంబర్​లో లిబియా రాజధాని ట్రిపోలిలో యువకులు అపహరణకు గురయ్యారు. లిబియాలోని భారత దౌత్యాధికారుల ప్రయత్నంతో ఉగ్రచెర నుంచి విముక్తి పొందారు.

Srikakulam youth
Srikakulam youth

By

Published : Oct 29, 2020, 4:34 AM IST

లిబియా దేశంలో అపహరణకు గురై 28 రోజుల పాటు ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉండి విడుదలైన శ్రీకాకుళం జిల్లా వాసులు స్వదేశానికి చేరుకున్నారు. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. గతేడాది అక్టోబర్​లో ఉపాధి కోసం లిబియా వెళ్లారు. జోగారావు, దానయ్య, వెంకటరావు వీసా గడువు పూర్తవడంతో సెప్టెంబర్ 12వ తేదీన స్వదేశానికి బయలుదేరారు. అదే రోజున లిబియాలోని ట్రిపోలి విమానాశ్రయం చేరువలో వారిని ఉగ్రవాదులు అపహరించారు.

యువకుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో లిబియాలోని భారత దౌత్యాధికారులు ముగ్గురు యువకులను ఉగ్రవాదుల చెర నుంచి ఈ నెల 11వ తేదీన విడిపించారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం వేకువజామున లిబియాలోని బెంగాజియా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్, భారతదేశానికి చెందిన మూడు వందల ఆరు మంది స్వదేశాలకు బయలుదేరారు. లిబియా నుంచి బంగ్లాదేశ్ లోని ఢాకాకు వీరంతా చేరుకున్నారు. అనంతరం అదే విమానంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. భారత దౌత్య అధికారులు వీరికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ ముగ్గురు యువకులను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్ని ఏర్పాట్లు చేశారు. యువకులు ఇవాళ స్వగ్రామానికి చేరుకొనే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :అనంతపురం ఓళిగ అంటే.. లొట్టలెయ్యాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details