శ్రీకాకుళం జిల్లాలోని గ్రానైట్ లిషింగ్ యూనిట్లు పన్నుల భారానికి నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు గ్రానైట్ పరిశ్రమల్ని మూసివేయనున్నట్లు యాజమాన్య సంఘం ప్రకటించింది. ప్రభుత్వం కన్సిడరేషన్ ఫీజు పేరిట 50 శాతం ధరలు పెంచుతోందని.. ఇది సరికాదని యాజమాన్య ప్రతినిధులు ఆందోళన చెందారు. కరోనాతో ఏడాదిన్నరగా పరిశ్రమలు మూతపడే స్థితిలో ఉండగా ప్రభుత్వ నిర్ణయంతో పూర్తిగా కోలుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పన్నుల భారానికి నిరసనగా.. గ్రానైట్ యాజమాన్యాల సమ్మె - శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు సమ్మెకు దిగాయి. పన్నుల భారాన్ని భరించలేమని ఆందోళన వ్యక్తం చేశాయి. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు పరిశ్రమల్ని మూసివేయనున్నట్లు యాజమాన్య సంఘం ప్రకటించింది.
గ్రానైట్ పరిశ్రమ