ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొటివాడ సచివాలయం అధికారులకు సంయుక్త కలెక్టర్ నోటీసులు - గొటివాడ సచివాలయం అధికారులకు నోటీసులు

శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామ సచివాలయాలను సంయుక్త కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొటివాడ సచివాలయ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు.

joint collector inspection on village  secretariat
సంయుక్త కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

By

Published : Jan 3, 2021, 9:25 AM IST

గ్రామ సచివాలయంలో పౌర సేవలు మరింత పెంచకుంటే.. ఎదురయ్యే ఫలితాలకు సచివాలయ సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం నరసన్నపేట నియోజకవర్గంలోని ఉర్లాం, గొటివాడ, బుడితి తదితర సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పౌర సేవలు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. జలుమూరు మండలం గొటివాడ సచివాలయంలో పని చేస్తున్న సిబ్బంది తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత కార్యదర్శి తో పాటు జలుమూరు ఎంపీడీఓలకు నోటీసులు జారీ చేశారు. తీరు మార్చుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details