శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని దుకాణాలు తెరుస్తారని కలెక్టర్ నివాస్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ప్యూ ఉంటుందన్నారు. రోజంతా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్న ఆయన అత్యవసర పరిస్ధితుల్లో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని వెల్లడించారు. కంటోన్మెంట్ జోన్ బయట మద్యం అమ్మకాలకు అనుమతి ఉందన్న కలెక్టర్ ఉదయం పదకొండు నుంచి రాత్రి ఏడు వరకు మద్యం విక్రయాలు ఉంటాయన్నారు.
సిక్కోలు వాసులకు లాక్డౌన్లో నూతన మార్గదర్శకాలు - corona cases in lock down news update
మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ కాలంలో పాటించాల్సిన నియమాలను కలెక్టర్ నివాస్ వివరించారు. ప్రభుత్వం వెసులుబాటును అనవసర అంశాలకు వినియోగించరాదని కలెక్టర్ నివాస్ ప్రజలను కోరారు.

లాక్డౌన్పై కలెక్టర్ నూతన మార్గదర్శకాలు