ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు: తమ్మినేని

రాష్ట్రంలో విద్యకు సీఎం జగన్​ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సీఎం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం శ్రీకాకుళం కలెక్టరేట్​లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా స్పీకర్​ తమ్మినేని సీతారాంతోపాటు మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.

By

Published : Apr 19, 2021, 5:52 PM IST

Published : Apr 19, 2021, 5:52 PM IST

speker tammineni and minister appalaraju participate in jagananna vidya divena programme
speker tammineni and minister appalaraju participate in jagananna vidya divena programme

పేదరికాన్ని పారద్రోలేందుకు విద్య అవసరమని స్పీకర్​ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విద్యతో దేనినైనా సాధించవచ్చని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని.. ఏ పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. విద్యకు ప్రాధాన్యంను ఇచ్చారన్న తమ్మినేని.. పాఠశాలలను నాడు - నేడు కార్యక్రమం కింద ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. జగనన్న విద్యా దీవెన కింద శ్రీకాకుళం జిల్లాలో 67 వేల 5 వందల 67 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, ముస్లిం, క్రిస్టియన్, కాపు తదితర వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details