శ్రీకాకుళం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యంను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి వాహనంలో తీసుకువస్తున్న 129 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మద్యం సీసాల విలువ రూ.31 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సీతంపేట ఎస్ఐ హైమావతి, బత్తిలి ఎస్ఐ షేక్ మహమ్మద్ ప్రత్యేక దళ పోలీసులతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 129 సీసాల అక్రమ మద్యం స్వాధీనం - శ్రీకాకుళం జిల్లా వార్తలు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 129 మద్యం బాటిళ్లను పట్టుకుని.. ఇద్దరిని అరెస్టు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత