దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల నిరసనకు తనదైన రీతిలో మద్దతు తెలిపారు సైకత శిల్పి గేదెల హరికృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసలోని సంగమేశ్వర దేవాలయ కొండ వద్ద అన్నదాత శిల్పం రూపొందించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. సైకత శిల్పం ద్వారా రైతులకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. శిల్పం చూసి పలువురు ఆయనను అభినందించారు.
రైతులకు మద్దతు..అన్నదాత సైకత శిల్పం - Farmers news
రైతులకు తనదైన రీతిలో మద్దతు పలికారు సైకత శిల్పి గేదెల హరికృష్ణ. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సైకత శిల్పంతో మద్దతు