శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలోని మూడు కోట్లతో నిర్మించే రహదారులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రారంభించారు. గత ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోకుండా నాలుగున్నరేళ్లు గడిపారని... కానీ సీఎం జగన్ మాత్రం గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
'గిరిజనుల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం' - ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి వార్తలు
మూడు కోట్ల రూపాయలతో నిర్మించే రహదారులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె అన్నారు.
roads opened by Deputy Chief Minister Pushpa shreevani in Sithampeta mandal of Srikakulam district
జిల్లాలో ఐదు పంచాయతీలను షెడ్యూల్ ఏరియాలో చేర్చకపోవడంపై చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. గిరిజనుల కోసం పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ఇదీ చదవండి:ఇవాళ సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ