ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చనిపోయిన వారు బతికొస్తారక్కడ..!

ఆ జిల్లాలోని రెవెన్యూ శాఖ లీలలు..అంతా ఇంతా కాదు. రేషన్ కార్డులో కొందరిని బతికుండగానే చంపేస్తారు. చనిపోయిన కొంతమందిని బతికిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రమార్గంలో వినియోగిస్తూ...ప్రభుత్వ పథకాలను మింగేస్తారు.

By

Published : May 16, 2019, 5:55 AM IST

చనిపోయిన వారు బతికొస్తారక్కడ..!

శ్రీకాకుళం జిల్లాలో మీసేవల లలూచీ దారుణం. అధికారుల అండదండలతో ఎవరినైనా చంపేస్తారు..ఎవరినైనా బతికేస్తారు. సర్కారు ఎంతటి టెక్నాలజీని వాడుతున్నా...దానికి దీటుగా వాడుతూ..ప్రభుత్వ పథకాలను మింగేస్తున్నారు. ఇలా సిక్కోలు జిల్లాలో మీ సేవల మాయజాలంతో ఎంతో మంది బలైపోతున్నారు.

చనిపోయిన వారు బతికొస్తారక్కడ..!
మరొకరికి..!

సూరమ్మ వయస్సు 80 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శంకరుణిఅగ్రహారంలో నివాసం ఉంటుంది. నా అనేవారు ఎవరూ లేరు. ప్రభుత్వం ఈమెకు 20ఏళ్ల క్రితం అంత్యోదయ రేషన్‌ కార్డు మంజూరు చేసింది. ఆమెకు ప్రభుత్వమిచ్చే..రేషన్‌ బియ్యం, పింఛనే దిక్కు. అయితే ఈమె బతికుండగానే కొందరు అధికారులు మృతి చెందినట్లు నిర్ధారించి...రేషన్‌ కార్డును తొలగించారు. అదే నంబరుతో గ్రామంలోని మరొకరికి అంత్యోదయ రేషన్‌ కార్డు కేటాయించారు. ఫిర్యాదు చేసేందుకు తహసీల్దారు కార్యాలయానికి వస్తే...అప్పుడు తెలిసింది ఆమెను బతికుండగానే చంపేశారని.
అధికారుల చేతివాటం

సూరమ్మ మృతి చెందిందని గ్రామానికి చెందిన ఒకరు 2018 డిసెంబరులో రెండు సార్లు, 2019 జనవరిలో ఒకసారి, ఫిబ్రవరి నెలలో మూడు సార్లు మందరాడలోని ఓ మీసేవ కేంద్రంలో రేషన్‌ కార్డు తొలగించేందుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసేటప్పుడు తప్పనిసరిగా మరణ ధ్రువపత్రం జతచేయాలి. ఇక్కడే కిందస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు చేతివాటం చూపించారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా ఆమె కార్డును తొలగించి.. అదే గ్రామానికి చెందిన మరొకరికి మంజూరు చేశారు. దీని వెనక మీసేవ కేంద్రం నిర్వాహకుడు, అధికారుల హస్తం ఉన్నట్లు తహసీల్దారు నిర్ధారణకు వచ్చారు.
ఇది ఒక్క సంతకవిటి మండలంలోనే కాదు. టెక్కలి మండలం చాకిపల్లిలో 33 రేషన్‌కార్డులు ఇలాగే వెలుగులోకి వచ్చాయి. అధికారులు దర్యాప్తు పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details