తిత్లీ తుపాన్ పరిహారం ఇచ్చి ఏడాది కాలేదు.మళ్లి ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడం కుదరదని..ఉద్యానవన అధికార్లు రైతులకు షాక్ ఇచ్చారు.శ్రీకాకుళంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది.అరటిపంటలు భారీగా నేలకొరిగాయి.మరో నెలలో పంట చేతికొస్తుందనుకున్న సమయంలో పంటనాశనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తమ పంటలకు నష్టపరిహారం ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికార్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.తమకు ప్రభుత్వమే సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
తిత్లీకి ఇచ్చాం, మళ్లీ కుదరదంటున్నారు:శ్రీకాకుళం రైతులు - వీరఘట్టం
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో అర్ధరాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షంతో భారీగా అరటి పంటలు నెలకొరిగాయి. నేలకొరిగిన పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం దక్కే అవకాశం లేదన్న అధికారుల సమాచారంపై రైతులు విలపిస్తున్నారు.
ఈదురుగాలి,వర్షలతో చేతికొచ్చిన పంట నేలపాలు