శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మేఘవరం చెరువులో జాలర్లు వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కింది. స్థానికుల సమాచారంతో గ్రీన్ మెర్సీ సర్ప సంరక్షణ గస్తీ బృందం... అటవీ సిబ్బందితో పాటు సేవ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లతో కలసి కొండచిలువను రక్షించారు. జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ ఆదేశాల మేరకు సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
జాలర్ల వలలో చిక్కిన కొండచిలువ - srikakulam district news today
శ్రీకాకుళం జిల్లా మేఘవరంలో కొండచిలువ కలకలం రేపింది. చేపల కోసం మత్స్యకారులు వేసిన వలలో సర్పం చిక్కింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ సొసైటీ సభ్యులు కొండచిలువను పట్టుకుని, అడవిలో విడిచిపెట్టారు.
జాలర్ల వలలో చిక్కిన కొండచిలువ