ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో భారీ డంప్​ స్వాధీనం.. - బీఎస్ఎఫ్

Huge dump seized in AOB: ఆంధ్రా - ఒడిశా(ఏవోబీ) సరిహద్దులో బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించాయి. ఈ గాలింపులో భారీ డంప్​ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా స‌మాచారంతో ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏఓబి లో భారీ డంప్ స్వాధీనం
Huge dump seized in AOB

By

Published : Oct 29, 2022, 4:39 PM IST

Huge dump seized in AOB: ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు.. మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సాయుధ బ‌ల‌గాలు క‌టాఫ్ ఏరియాలో గాలింపు చేపట్టారు. మ‌ల్కాన్‌గిరి జిల్లా జొడొంబో ప‌రిధిలోని కుసుముపుట్టు అట‌వీ ప్రాంతంలో.. భారీ డంప్‌ను పోలీసులు గుర్తించారు. ఈ డంప్‌లో 303 ర‌కం తుపాకీలు, గ్యాస్ గ‌న్‌లు-2, దేశ‌వాళీ తుపాకీలు, మందుపాత‌ర‌లు, గ్రెనెడ్‌లతోపాటు.. భారీ ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌ ఎస్​జెడ్​సీ మావోయిస్టు దళానికి చెందిన‌దిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు సామాగ్రి, ఆయుధాల‌తో అమాయ‌క పౌరులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వారిని హ‌త‌మార్చ‌డానికి ఈ డంప్‌లో ఉంచిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గాలింపు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details