పలాసలో 350 కిలోల గంజాయి పట్టివేత - smugglers
పలాసలో రెండు కార్లలో గంజాయిని తరలిస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పలాసలో 350 కిలోల గంజాయి పట్టివేత
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒడిశాకు గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లతోపాటు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.